Site icon vidhaatha

Rahul Gandhi | కర్ణాటకలో రసవత్తరంగా ‘నందిని’ రాజకీయం..! స్టోర్‌ను సందర్శించిన రాహుల్‌ గాంధీ..!

Rahul Gandhi | కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ క్రమంలో పార్టీలు తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఓటర్లను తమ వైపు తప్పించుకునే పనిలో పడ్డాయి. అయితే, ప్రస్తుతం కన్నడనాట ‘అమూల్‌’ ప్రవేశంపై వివాదం నడుస్తున్నది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, గాంధీ, కేసీ వేణుగోపాల్‌, కర్నాటక చీఫ్‌ డీకే శివకుమార్‌ బెంగళూరులోని జేపీనగర్‌లో ఉన్న నందిని మిల్క్‌ పార్లర్‌ను సందర్శించారు. ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది. స్థానిక డెయిరీ సంస్థ ‘నందిని’ నిర్వీర్యం చేసేందుకు అమూల్‌ను తీసుకువచ్చారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌ నందిని స్టోర్‌ను సందర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కర్ణాటకలో నందిని సంస్థ పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూ విక్రయిస్తున్నది. ఈ బ్రాండ్‌కు కన్నడనాట మంచి పేరుంది. అయితే, గతేడాది డిసెంబర్‌లో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌ షా గుజరాత్‌కు చెందిన అమూల్‌.. నందిని సహకారం చేసుకోవాలని సూచించారు. దాంతో వివాదం రాజుకున్నది. అమూల్‌లో నందినిని విలీనం చేయాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను అధికార బీజేపీ తోసిపుచ్చుతూ.. నందిని దేశంలోనే నంబర్‌ వన్‌ బ్రాండ్‌ అవుతుందని.. అమూల్‌పై రాజకీయాలు ఉండొద్దని వ్యాఖ్యానించారు. మరో వైపు నందిని బ్రాండ్‌ దక్షిణ భారతంలో విస్తరిస్తున్నది. ఇటీవల కేరళలో అవుట్‌ లెట్‌ను ప్రారంభించింది. కేరళలో నందిని ఎంట్రీపై కేరళ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్లు మండిపడ్డాయి. వేరే రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తే.. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సంస్థల పరిస్థితి ఏంటని ప్రశ్నించాయి.

Exit mobile version