Site icon vidhaatha

Warangal: రాహుల్ జీ మేరా ఘర్ ఆప్ కా ఘర్.. నా ఇల్లు మీ ఇల్లు: రాజేందర్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీని ఇల్లు ఖాళీ చేయించిన నేపథ్యంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు నాయిని రాజేందర్ రెడ్డి నా ఇల్లు మీ ఇల్లు.. నేను మిమ్ములను నా ఇంటికి ఆహ్వానిస్తున్నానని ఈ ఇల్లు ఇక మీదేనని ఇక్కడే ఉండవచ్చని కోరారు.

ఈ సందర్భంగా నాయిని రాజనేదర్ రెడ్డి మాట్లడుతూ.. పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని చెప్పారు. ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయందోలనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారని ఆరోపించారు.

ఆదానిపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్ పై అనర్హత వేటు వేశారన్నారు. రాహుల్ గాంధీని చూసి మోదీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది మోడీ ప్రభుత్వం. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేసి కుట్ర పూరితంగా పార్లమెంట్ నుంచి రూమును ఖాళీ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

రాహుల్ గాంధీ మా గుండెల్లో ఉన్నాడు, 130 కోట్ల ప్రజానీకం తలుపులు రాహుల్ గాంధీ గారికి తెరిచే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మహమ్మద్ అంకుష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొంత సారంగం, NSUI జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పల్లకొండ సతీష్, డివిజన్ అద్యక్షుడు వల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version