Site icon vidhaatha

Rain Alert | తెలంగాణలో మరో రెండు రోజులు వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ

Rain Alert | తెలంగాణ(Telangana)లో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు తేలిక పాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ తర్వాత పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

గాలి విచ్ఛిన్నతి విదర్భ నుంచి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వద్ద కొనసాగుతుందని పేర్కొంది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, గంటకు సుమారు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

అలాగే సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడుతాయని వివరించింది.

Exit mobile version