Rains | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ, ఏపీ ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధవారం సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. అయితే రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దీంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశ ఉంది. బుధవారం ఖమ్మం, నల్లగొండ, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో వడగాలు వీచాయి. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడకక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.