Rakul Preet Singh | ముదురు హీరోతో ముద్దు స‌న్నివేశాల వళ్లే.. నా కెరీర్ నాశ‌న‌మైంది: ర‌కుల్

Rakul Preet Singh టాలీవుడ్‌లో అదృష్టం క‌లిసి రాక బాలీవుడ్‌కి చెక్కేసిన అందాల ముద్దుగుమ్మ.. ర‌కుల్ ప్రీత్ సింగ్. పాకెట్ మనీ కోసం సినిమాల‌లోకి వ‌చ్చిన ఈ భామ గిల్లీ అనే క‌న్న‌డ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. దేశ‌ముదురు సినిమా అవ‌కాశం ర‌కుల్‌ని ప‌ల‌క‌రించిన ఈ సినిమాకి ఆమె నో చెప్పింది. దీంతో ఆ అవ‌కాశం హ‌న్సిక‌కి ద‌క్కింది. తెలుగులో కెర‌టం అనే సినిమాతో ఈ అమ్మ‌డికి అవ‌కాశం రాగా, ఈ సినిమా నిరాశ‌ ప‌ర‌చింది. […]

  • Publish Date - July 3, 2023 / 01:44 AM IST

Rakul Preet Singh

టాలీవుడ్‌లో అదృష్టం క‌లిసి రాక బాలీవుడ్‌కి చెక్కేసిన అందాల ముద్దుగుమ్మ.. ర‌కుల్ ప్రీత్ సింగ్. పాకెట్ మనీ కోసం సినిమాల‌లోకి వ‌చ్చిన ఈ భామ గిల్లీ అనే క‌న్న‌డ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. దేశ‌ముదురు సినిమా అవ‌కాశం ర‌కుల్‌ని ప‌ల‌క‌రించిన ఈ సినిమాకి ఆమె నో చెప్పింది.

దీంతో ఆ అవ‌కాశం హ‌న్సిక‌కి ద‌క్కింది. తెలుగులో కెర‌టం అనే సినిమాతో ఈ అమ్మ‌డికి అవ‌కాశం రాగా, ఈ సినిమా నిరాశ‌ ప‌ర‌చింది. అయితే యువ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ మూవీతో త‌న కెరీర్‌లో మొద‌టి హిట్ కొట్టింది. ఇక అక్క‌డి నుంచి దూసుకుంటూ పోయింది ర‌కుల్.

ఆది సాయి కుమార్ రఫ్​, గోపిచంద్ లౌక్యం, కరెంట్​తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​2, స్పైడర్, మన్మథుడు 2, విన్నర్, బ్రూస్ లీ, పండుగ చేస్కో, కొండపొలం వంటి తదితర సినిమాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది.

Rakul Preet Singh Hot | టూ పీస్ బికినీలో.. ‘రకుల్’ రచ్చ రంబోలా! వీడియో వైరల్

అయితే ఇటీవ‌లి కాలంలో ర‌కుల్‌కి సౌత్‌లో అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. చివ‌రిగా ఈ అమ్మ‌డు న‌టించిన మన్మథుడు 2, చెక్, కొండపొలం చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా నిరాశ‌ప‌రిచాయి. అయితే త‌నకు సౌత్‌లో సరైన అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణం ఓ ముదురు హీరోతో రొమాన్స్ చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చింది ర‌కుల్.

Latest News