విధాత: ఎంత పెద్దవాడైనా ఓ తల్లికి తండ్రికి బెడ్డే. ఎంత గొప్పవాడైనా ఓ తండ్రికి అతను తనయుడే. అలా తండ్రి కొడుకుల అనుబంధం పెనవేసుకొని ఉంటుంది. ఎవరికివారు తాము పెద్దవారిమైపోయాము… తమకు కూడా వయసు వచ్చి పెళ్లిళ్లు అయ్యాయి. తండ్రులుగా మారామని భావిస్తూ ఉంటారు. కానీ వారి తల్లిదండ్రులు మాత్రం వారిని ఇంకా చిన్న వారిగానే భావిస్తూ మందలిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత వచ్చిన భార్య ముందు తల్లిదండ్రులు తమ కుమారుని తిడితే ఆ కోడళ్ళకు మనవళ్లకు కోపం వస్తుంది. అయినా అదంతా తల్లిదండ్రులు ప్రేమతో చేసే పని.
ఇక RRRసినిమాతో అంతర్జాతీయంగా పాపులారిటీ సంపాదించిన రామ్ చరణ్ ప్రస్తుతం ఖుషిగా ఉన్నాడు. కలెక్షన్లు, రివార్డులు, అవార్డులతో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సరదాగా గడుపుతున్నాడు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిన్నప్పటి నుంచి నాకు నటన అంటే ఇష్టం. ఈ క్రమంలో కాలేజీకి వెళ్లిన చదువు ఎక్కేది కాదు. నాన్నేమో మొదట చదువు పూర్తి చేయి. తర్వాత నీకు ఇష్టమైంది చేయమని సలహా ఇచ్చేవారు. అలా ఆసక్తి లేకుండా ఎంతోకాలం చదువుతూ రావడంతో మా కాలేజీ నుంచి మా నాన్నకు ఫోన్ వచ్చింది. మీ అబ్బాయికి ఏం కావాలనిపిస్తే అది చేయనివ్వండి. అనవసరంగా మా సమయం మీ కొడుకు సమయాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పడంతో యాక్టింగ్ స్కూల్ కి షిఫ్ట్ అయ్యాను.
యాక్టర్ గా 40 ఏళ్లుగా నాన్న సినిమాల్లో ఉన్నారు. ఎంత తండ్రి అయినా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటాడు. బాడీ షేప్ కొంచెం మారిందంటే అసలు ఊరుకోడు. డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేసేటప్పుడు బరువు తగ్గిపోయావేంట్రా అని అంటాడు. నేను నిజమేనని తలవుపే వాడిని. ఆయన మాత్రం ఇడియట్ నేనేదో సరదాగా అన్నాను ఇప్పటికే చాలా బరువు పెరిగి పోయావు. ఏమైనా పట్టించుకుంటున్నావా? జిమ్ముకు వెళ్ళు అని కోప్పడేవారు.
ఆ మాటలు విని అక్కడే ఉన్న నా భార్య ఉపాసన ఏంటి నా భర్తని ఇలా అవమానిస్తున్నాడేంటి అంటూ ఆశ్చర్యపోయేది. కానీ అది అవమానించడం కాదు. ఇద్దరూ నటుల మధ్య మాటలు ఇలాగే ఉంటాయని ఆమెకు నేను నచ్చ చెప్పేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.