Ratha Saptami | హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమిని ఘనంగా జరుపుకొంటారు. దక్షిణ భారత దేశంలో ఈ రోజునే మకర సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటారు. ఇతర నెలలలోని సప్తమి తిథులకన్నా మాఘమాసంలోని సప్తమి తిథి ఎంతో విశిష్టమైంది. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి, అదితి దంపతులకు సూర్య దేవుడు మాఘ శుద్ధ సప్తమి నాడే జన్మించాడు. రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించిన వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయని నమ్ముతారు. ఈ సారి రథసప్తమి ముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం.
ఫిబ్రవరి 16న రథసప్తమి
రథసప్తమి పండుగ 16న నిర్వహించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ పండుగకు సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి, ఆరోగ్య సప్తమి అని కూడా పేర్లున్నాయి. సూర్యభగవానుడు ఈ రోజునే తన దివ్యకాంతితో ప్రత్యక్షమయ్యాడని పురారణాల్లో ఉన్నది. రథసప్తమి నాడు సూర్యోదయ సమయాన నదీస్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. ఈసారి రథ సప్తమి ఫిబ్రవరి 15న-16వ మధ్య వచ్చింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి తిథి గురువారం (15న) ఉదయం 10.12 గంటలకు ప్రారంభమవుతుంది. 16న అంటే శుక్రవారం ఉదయం 8.54 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం.. ఉదయ తిథి ప్రకారం 16న శుక్రవారం రోజున రథ సప్తమి జరుపుకుంటారు. ఈ సమయంలో ఉపవాస దీక్షలు, ప్రత్యక్షదైవమన సూర్యనారాయణుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.