విధాత: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ రియల్ మి మరో కొత్త ఫోన్ రియల్ మి జీటీ 5 ప్రొ (Realme GT 5 Pro)ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 మూడో జనరేషన్ ప్రాసెసర్ ఉండనున్నది. ఇది క్వాల్ కామ్ రూపొందించిన సరికొత్త ప్రాసెసర్. ఇప్పటివరకు కేవలం కొన్ని స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే వినియోగించారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoCతో పాటు, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడెర్నో 750 జీపీయూ సైతం ఉన్నది. స్మార్ట్‌ఫోన్ లో 6.78-అంగుళాల 1.5కే కర్వ్‌డ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది.
భారీగా పెరిగిన కరోనా కేసులు.. కేరళ రాష్ట్రంలోనే అత్యధికం
https://vidhaatha.com/national/india-records-166-fresh-cases-of-covid-19-203983
ఇది 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్.. 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్.. 4,500 నిట్‌తో వస్తుంది. రియల్ మి 5 ప్రొ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెటప్ ఉంటుంది. సోనీ LYT-808 సెన్సార్ ఉన్న 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుండగా.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేయనున్నది. ఇందులో సెకండరీ కెమెరా సైతం 50 ఎంపీ ఉంటుంది. రియల్ మి జీటీ 5 ప్రొ స్మార్ట్ ఫోన్‌లో 5,400 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని 100 వాట్స్ వైర్డ్ ఛార్జర్ లేదంటే.. 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
కదులుతున్న రైల్లో మహిళపై లైంగిక దాడి.. పోలీసులకు చిక్కకుండా డ్రామా
https://vidhaatha.com/crime/assault-against-a-woman-in-a-moving-train-203981
ఈ మొబైల్ ఆండ్రాయిడ్-14 ఆధారంగా రియల్ మి యూఐ 5.0పై నడుస్తుంది. రియల్ మి జీటీ 5 ప్రొ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.39,900 వరకు ఉండనున్నది. చైనా కరెన్సీలో 3,399 యువాన్స్ పలుకుతున్నది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ మొబైల్ ధర రూ.46,900 వరకు ఉండగా.. 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ సుమారు రూ.50,400 వరకు ఉంటుంది. రెడ్ రాక్, స్టారీ నైట్, బ్రైట్ మూన్ రంగుల్లో అందుబాటులో ఉన్నది.