Site icon vidhaatha

నామినేషన్లు దాఖలు చేసిన రేణుక చౌద‌రి.. అనిల్‌లు


విధాత, హైదరాబాద్‌ : తెలంగాణలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు సీనీయర్ నాయకురాలు రేణుకాచౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌లు గురువారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో వారు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. వారు మూడు సెట్లుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డి. శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు. అటు బీఆరెస్‌ అభ్యర్థిగా వద్దిరాజు రవి చంద్ర కూడా తన నామినేషన్ దాఖలు చేశారు.



రేపు శుక్రవారం నామినేషన్లు పరిశీలన, 20వ తేదీన ఉపసంహరణ, 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి. రాష్ట్రంలో బీఆరెస్‌కు చెందిన వద్ధిరాజు రవిచంద్ర, జోగినిపల్లి సంతోశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌ల స్థానాలు ఖాళీ కానుండగా, ఈ మూడుసీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో పార్టీల ప్రస్తుత బలాబలాలను అనుసరించి రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆరెస్‌కు దక్కనున్నాయి.

Exit mobile version