Site icon vidhaatha

Revanth Reddy | అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరు: రేవంత్ రెడ్డి

Revanth Reddy | విధాత: ప్రజా సమస్యలపై ఉద్యమించే పార్టీల నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వరంగల్ వాసులకు నష్టపరిహారం, సహాయ పునరావాసాలు అందించాలని కోరుతు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.

కాగా.. నిరసనకు వెళ్లకుండా పలువురు కాంగ్రెస్ (Congress) సీనియర్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి, వారితో కార్పోరేషన్ అధికారులు మాట్లాడి వరద బాధితులకు సహాయ చర్యలు అందేలా చూడాలన్నారు. అరెస్టులతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Exit mobile version