Site icon vidhaatha

ఇదే ప‌రిస్థితి మీకు వ‌స్తుంది: ట్విట్ట‌ర్‌లో రాంగోపాల్ వ‌ర్మ

బ‌డా హీరోల‌కు శాప‌నార్థాలు పెడుతూ..
ట్విట్ట‌ర్‌లో రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న పోస్టులు

విధాత‌, హైద‌రాబాద్: కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల నేప‌థ్యంలో ఒక రోజు షూటింగ్ ఆపాల‌ని డిమాండ్ చేస్తు వ‌ర్మ సోష‌ల్ మీడియా వేధిక‌గా సంచ‌న‌ల పోస్టులు షేర్ చేశారు. గొప్ప న‌టుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క‌రోజు కూడా షూటింగ్ ఆప‌లేని అత్యంత స్వార్థ‌పూరిత తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు నా జోహార్లు, సిగ్గు, సిగ్గు అంటూ వ‌ర్మ ట్వీట్ చేశారు. వ‌ర్మ వరుస‌గా చేసిన ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వ‌ర్మ ట్వీట్లు..
కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవిగారికి, మోహనబాబుగారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కల్యాణ్కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు . ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.

భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు ! సిగ్గు.

మనసు లేకపోయినా ఓకే . కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.