Site icon vidhaatha

సీఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ

విధాత, విజయవాడ: ఏపీ సీఎం జగన్‌తో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు. రామ్ గోపాల్ వర్మను ముఖ్యమంత్రి జగన్ విందుకు ఆహ్వానించారు. దీంతో జగన్ నివాసానికి వెళ్లిన ఆర్జీవీ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఇరువురు సమావేశం కొనసాగింది.

ఈ భేటీలో వారు తెలుగు సినీ పరిశ్రమ, కార్మికులు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ సమావేశం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. గతంలో టికెట్‌ల వివాదం చెలరేగినప్పుడు కూడా ఆయన ఓసారి సీఎంతో సమావేశమయ్యారు.

ఇప్పుడు చాలా రోజుల తర్వాత భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా తీశారు. అప్పట్లో అదో సంచలనంగా మారింది. వైసీపీ స్పాన్సర్డ్‌ సినిమాగా టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా వీళ్లిద్దరు భేటీ కావడంతో మరోసారి సినిమాల ప్రస్తావన తెరపైకి వచ్చింది.

Exit mobile version