Site icon vidhaatha

Rohit Sharma | ప్రమాదంలో హిట్‌ మ్యాన్‌ కెప్టెన్సీ..! వెస్టిండీస్‌ టూర్‌ తర్వాత కీలక నిర్ణయం తీసుకోనున్న సెలెక్టర్లు..!

Rohit Sharma |

ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో రోహిత్‌సేన ఓటమి పాలైంది. కెప్టెన్‌తో పాటు భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ ఆగ్రహంగా ఉందని, రోహిత్‌ కెప్టెన్సీని నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం భారత్‌ వెస్టిండీస్‌ టూర్‌లో రెండు టెస్టులు ఆడనున్నది. ఈ టెస్టులకు కెప్టెన్‌గా రోహిత్‌ కొనసాగనున్నాడు.

అయితే, కెప్టెన్‌ పదవి నుంచి రోహిత్‌ తప్పుకుంటే మరొకరికి కెప్టెన్‌ ఛాన్స్‌లో లేదు. ఈ పర్యటన తర్వాత టెస్ట్‌ ఫార్మాట్‌లో రోహిత్‌ కెప్టెన్సీ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. విండీస్‌ సిరీస్‌లో ఏమైనా భారత్‌ ఓటమి పాలైతే కెప్టెన్సీ నుంచి తప్పుకోక, తొలగించని పరిస్థితి రావచ్చని క్రికెట్‌ పండితులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ప్రపంచ టెస్ట్‌చాంపియన్‌ షిప్‌లో ఓటమి తర్వాత రోహిత్‌పై సీనియర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరేబియన్‌ దీవుల్లో వెస్టిండిస్‌తో జులై 12 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ మొదలవునున్నది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లో పాల్గొననున్నది. టెస్ట్‌ సిరీస్‌లో రోహిత్‌ కెప్టెన్‌గా రాణించడంతో పాటు బ్యాట్‌తోనూ పరుగులు సాధించాల్సిన అవసరం ఉన్నది. బ్యాటర్‌గా విఫలమైనా బీసీసీఐ కఠిన నిర్ణయమే తీసుకోనున్నది.

అయితే, రోహిత్‌ కెప్టెన్సీ ప్రమాదంలో ఉందన్న వార్తలను ఓ బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఖండించారు. అయితే టెస్ట్‌ సైకిల్‌ రెండేళ్లు పూర్తయ్యే వరకు కెప్టెన్‌గా ఉంటాడా? లేడా? మాత్రం చెప్పలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్‌ ఫామ్‌ను చూసి సెలక్షన్ కమిటీ తుది నిర్ణయానికి రావొచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. 2023-2025 వరకు ప్రపంచ టెస్ట్‌చాంపియన్‌ షిప్‌ సైకిల్‌ ఉంటుంది. ఫైనల్‌ మ్యాచ్‌ వచ్చే సరికి రోహిత్‌ వయసు 38 ఏళ్ల వయసుంటాడు. అప్పటి వరకు క్రికెట్‌ ఆడతాడా?.. లేక రిటైర్‌ అవుతాడా? వేచి చూడాలి. జులై వెస్టిండిస్‌తో జరిగే టెస్టుల తర్వాత డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ వరకు మధ్యలో భారత జట్టు టెస్టులు ఆడబోవడం లేదు. దాంతో రోహిత్‌పై సెలెక్టర్లు నిర్ణయం తీసుకునేందుకు వీలు దొరకనున్నది.

కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత మొదట టీ20, వన్డే ఫార్మాట్ల బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ తర్వాత టెస్ట్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే, కెప్టెన్సీ తీసుకువచ్చిన భారమో.. లేదంటే ఫామ్‌ లేమీయో గానీ రోహిత్‌ బ్యాటింగ్‌ దెబ్బతింది. కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాక టీమిండియా పది టెస్టులు ఆడగా.. మూడింటిలో ఆడలేదు. ఏడు టెస్టుల్లో కేవలం 390 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. మిగతా ఇన్నింగ్స్‌లో కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం.

Exit mobile version