Trains | రైళ్ల‌పై రాళ్ల దాడులు చేస్తే.. ఐదేండ్ల జైలు శిక్ష‌

Trains | వేగంగా క‌దులుతున్న రైళ్ల‌పై, స్టేష‌న్‌ల‌లో( Railway Stations ) ఆగి ఉన్న రైళ్ల‌పై ఆక‌తాయిలు రాళ్ల‌తో దాడులు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. ప్ర‌స్తుతం అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే( South Central Railway ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రైళ్ల‌పై రాళ్లతో దాడులు చేస్తే.. అలాంటి వారికి ఐదేండ్ల జైలు శిక్ష( Jail ) విధిస్తామ‌ని రైల్వే అధికారులు హెచ్చ‌రించారు. ఇటీవ‌ల వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌( […]

  • Publish Date - March 29, 2023 / 01:03 AM IST

Trains | వేగంగా క‌దులుతున్న రైళ్ల‌పై, స్టేష‌న్‌ల‌లో( Railway Stations ) ఆగి ఉన్న రైళ్ల‌పై ఆక‌తాయిలు రాళ్ల‌తో దాడులు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నాయి. ప్ర‌స్తుతం అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే( South Central Railway ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రైళ్ల‌పై రాళ్లతో దాడులు చేస్తే.. అలాంటి వారికి ఐదేండ్ల జైలు శిక్ష( Jail ) విధిస్తామ‌ని రైల్వే అధికారులు హెచ్చ‌రించారు.

ఇటీవ‌ల వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌( Vande Bharath )తో పాటు ప‌లు రైళ్ల‌పై రాళ్ల దాడులు జ‌రిగిన విష‌యం విదిత‌మే. దీంతో రైల్వే ఆస్తుల‌కు( Railway Proprty ) న‌ష్టం క‌లిగించే చ‌ర్య‌ల‌కు ఎవ‌రూ పాల్ప‌డ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేశారు. భువ‌న‌గిరి, కాజీపేట‌, ఖ‌మ్మం, ఏలూరు, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 9 ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌ల‌కు బాధ్యులైన 39 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. రాళ్ల దాడుల్లో ఐదుగురు ప్ర‌యాణికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో రైళ్ల‌పై రాళ్లతో దాడులు చేసే వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణ‌యించింది.

Latest News