Site icon vidhaatha

హెచ్‌ఆర్ఏ కోతపై ఆర్టీసీ వివరణ

విధాత: తమ ఉద్యోగుల ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ)ను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల సవరించింది. అయితే హెచ్‌ఆర్‌ఏలో కోత విధించినట్లుగా ప్రచారం చోటుచేసుకోవడంతో దీనిపై ఆర్టీసీ సంస్థ వివరణ ఇచ్చింది. జీవో నంబర్‌ 53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరణ చేయాలని 2020లో యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పడు ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజన్‌ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను తాత్కాలికంగా సంస్థ నిలుపుదల చేసింది.


తాజాగా 2017 పే స్కేల్‌ ను రివిజన్‌ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను యాజమాన్యం సవరించింది. హెచ్‌ఆర్‌ఏ సవరణపై జరుగుతున్న అసత్య ప్రచారం నేపథ్యంలో ఈ వివరణను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వడం జరిగింది.

Exit mobile version