Salaar |
మూడు వరుస ఫ్లాపులతో తీవ్ర నిరాశలో ఉన్న ఫ్రభాస్ ఫ్యాన్స్‌ని ఉత్తేజ పరిచేందుకు ప్రశాంత్ నీల్ సలార్ అనే క్రేజీ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాడు. భారీ కటౌట్‌తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే అవి చరిత్రలు సృష్టించడం ఖాయం. కాని సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల దర్శకులు ప్రభాస్‌ని సరిగ్గా వాడుకోలేకపోయారు.
ఇప్పుడు కేజీఎఫ్ చిత్రంతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా సలార్ చిత్రం చేస్తున్నాడు.ఇన్నాళ్లు ఈ మూవీ పోస్టర్స్‌తో ఉత్సాహపరచిన ప్రశాంత్ నీల్ కోడి కూయకముందే చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
టీజర్ ఎండింగులో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా చూపించారు. టీజర్‌లో ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ అంతటా కనిపించింది. అయితే కొందరు టీజర్ చూశాక ఇది కేజీఎఫ్ 2కి కొనసాగింపు అంటున్నారు. కేజీఎఫ్2 ఉదయం 5.12కి ముగుస్తుంది.
ఇప్పుడు అదే సమయానికి సలార్ టీజర్ విడుదల చేయడం పట్ల కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సలార్‌ని కూడా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. సెప్టెంబర్ 28న విడుదల కానున్న ఈ చిత్రంలో కథానాయికగా శృతి హాసన్ నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నారు.
THE MOST VIOLENT MEN… CALLED ONE MAN… THE MOST VIOLENT