విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెప్పినట్లుగానే ఒకటో తారీఖునే జీతాలు వారి అకౌంట్లలో జమ చేయడం పట్ల వారిలో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతాలు ఎప్పుడు జమ అవుతాయోనని ఒకటో తారీఖు నుంచి నెలంతా ఎదురుచూపులు పడాల్సివచ్చేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా ఒకటో తారీఖునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు వేతన చెల్లింపులు జరిగిపోవడం ఆయా వర్గాల్లో రెండు ప్రభుత్వాల పనితీరును చర్చనీయాంశం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు ప్రతి నెల చెల్లించక తప్పదని అలాంటప్పుడు ఆలస్యం చేసి ప్రయోజనమేమిటని, వారికి ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఒకటో తేదీన జీతాలు రావడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల కుటుంబాల్లో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి.