Site icon vidhaatha

ఇక నా వల్ల కాదు.. ఎట్టకేలకు తన అనారోగ్యంపై సమంత క్లారిటీ!

విధాత‌, సినిమా: ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ సమంతపై వచ్చినన్నీ రూమర్లు మరో హీరోయిన్‌పై రాలేదంటే.. అతిశయోక్తి కానే కాదు. ముఖ్యంగా ఆమె చైతూతో విడాకుల విషయంలోనే హాట్ టాపిక్ అయితే.. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో రెచ్చిపోయిన తీరు మరింతగా ఆమెను వార్తలలో నిలిపింది. ఆమె చేసే ప్రాజెక్ట్స్, ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ప్రతీది ఆమెను ఏదో రకంగా వార్తలలో నిలుపుతున్నాయి.

సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

ఇక రీసెంట్‌గా ఆమె ఫారిన్ వెళ్లడంతో.. అనేక రకాలుగా రూమర్లు వ్యాపించాయి. హెల్త్ ట్రీట్‌మెంట్ కోసమని ఒకసారి.. కాదు, తర్వాత ఆమె చేయబోయే సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ నిమిత్తం శిక్షణ పొందేందుకు అని మరోసారి.. ఇలా ఆమెపై వార్తలు వైరల్ అయ్యాయి.

ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా?

అయితే ఎక్కడా.. సమంత ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు, రీసెంట్‌గా ఆమె లుక్ చూసిన వారంతా.. ఆమె ఏదో సర్జరీ నిమిత్తం ఫారిన్ వెళ్లినట్లుగా భావిస్తూ.. మరోసారి వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో.. ఇక లాభం లేదనుకున్నట్లుంది.

అసలు తనకు ఏమైందో క్లారిటీ ఇస్తూ.. సోషల్ మీడియా వేదికగా అసలు విషయాన్ని తెలియజేసింది. ఆమె హెల్త్ పరంగానే ఇబ్బందులు పడుతున్నట్లుగా తాజాగా ఆమె చేసిన పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌లో సమంత డబ్బింగ్ చెబుతున్న ఫొటోని కూడా యాడ్ చేసింది. ఈ పిక్‌లో ఆమె చేతికి సెలైన్ కూడా ఉంది. దీంతో ఆమె నిజంగానే హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతుందనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పింది సమంత.

ఇక ఆమె చేసిన పోస్ట్‌లో.. ‘‘యశోద సినిమా ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ఈ జీవితం నా ముందు ముగింపులేని సవాళ్లను ఉంచింది. అభిమానుల ప్రేమ, అభిమానం నాకు మరింత మనోబలాన్ని.. అలాగే ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది.

రాత్రంతా సెలబ్రేట్ చేసుకున్నాం: నరేష్, పవిత్రా లోకేష్‌!

గత కొన్ని నెలలుగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. ‘మయోసిటిస్‌’ అనే ఆటో ఇమ్యూనిటీ సమస్యను ఫేస్ చేస్తున్నాను. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నాను. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాల్సింది.. కానీ కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు నా ఆరోగ్యం స్టేబుల్‌గా ఉంది.

త్వరలోనే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు చెప్పారు. జీవితంలో మానసికంగానూ, అలాగే శారీరకంగానూ మంచి, చెడులను చూశాను. ఇలా ఉండటం నా వల్ల కావడం లేదు.. ఎలాగో క్షణాలు గడుస్తున్నాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి త్వరలోనే రాబోతుందని ఆశిస్తున్నాను. అందరికీ లవ్‌ యూ.. దిస్ టు షల్ పాస్..’’ అని సమంత తన ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version