Samantha | టాలీవుడ్ బ్యూటీ సమంత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజిబీజీగా ఉన్నది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. పెద్దగా ఆకట్టుకులేకపోయింది. ప్రస్తుతం తెలుగులో ఖుషిలో నటిస్తున్నది. అదే సమయంలో బాలీవుడ్‌లో సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నది.
ఒకేసారి రెండు పూర్తి చేయాలని చూస్తున్నది. రెండు చిత్రాల షూటింగ్‌లో ఏ మాత్రం బ్రేక్ దొరికినా విహారయాత్రలకు వెళ్తున్నది. ఆదివారం హైదరాబాద్‌లో సమంత ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో వైట్ పాంట్, బ్లాక్ టాప్‌లో కనిపించింది. హుడీ జాకెట్‌ను నడుముకు కట్టుకొని స్టయిలిష్ లుక్‌లో అభిమానులను సందడి చేసింది.