Site icon vidhaatha

మేడారంలో విషాదం..సమ్మక్క తల్లి పూజారి మృతి

విధాత : సమ్మక్క సారలమ్మ మేడారం గ్రామంలో విషాధం చోటుచేసుకుంది. సమ్మక్క తల్లి పూజారి సిద్ధబోయిన దశరథం అనారోగ్య కారణాలతో మంగళవారం తుది శ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితమే దశరథం అన్న సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు సైతం అనారోగ్య కారణాలతో మరణించారు. స్వల్ప కాలంలోనే అన్నదమ్ముల మృతితో మేడారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా జరిగిన మేడారం జాతర సందడి మరువకముందే సమ్మక్క తల్లి పూజరి దశరథం మృతి చెందడం బాధకరంగా ఉందని గ్రామస్తులు ఆవేధన వ్యకం చేస్తున్నారు.

Exit mobile version