విధాత: పర్వత ప్రాంతాల్లో మనం పర్యటిస్తున్నప్పుడు కొత్త కొత్త అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ పర్వతాల్లో ఉండే ఆవాసాలను, జంతువులను చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. అనేక కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆత్రుత కలుగుతుంది.
అయితే ఓ మహిళ ఫ్రాన్స్‌లోని ఓ పర్వత ప్రాంతంలో జాగింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఆమెను వందల సంఖ్యలో ఉన్న గొర్రెలు ఫాలో అయ్యాయి. ఆ మహిళ ఆగిపోతే ఆ గొర్రెలు కూడా ఆగిపోయాయి. అలా ఆ యువతిని అనుసరిస్తూ గొర్రెల మంద పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.