Site icon vidhaatha

పదిరోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఆత్మహత్య

విధాత : పదిరోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యాశ్రీ (23) గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో ఉంటూ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది.


కాగా.. మార్చి 17న ఆమెకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్లాల్సి ఉండగా.. హాస్టల్లోని బాత్‌రూమ్‌లో షవర్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version