Site icon vidhaatha

అత్తగారు బంగారం పెట్టడం లేదని.. విద్యుత్‌ స్తంభమెక్కిన అల్లుడు..!

విధాత : అత్తగారు బంగారం పెట్టలేదనే కారణంతో ఓ అల్లుడు విద్యుత్‌ స్తంభంమెక్కాడు. ఈ ఘటన మెదక్‌ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో చోటు చేసుకున్నది. పట్టణానికి చెందిన శేఖర్ ఎలక్ట్రిషియన్‌గా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలం కిందట ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లికి అత్తగారు బంగారం పెట్టడం లేదనే మనస్తాపంతో కరెంటు స్తంభమెక్కాడు.

బంగారం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులకు అధికారులకు సమాచారం అందివ్వడంతో కరెంటు సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సైతం సంఘటనా స్థలానికి చేరుకొని కాపాడేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, డీఎస్పీ, సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని శేఖర్‌కు నచ్చజెప్పారు. బంగారం ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగి రావడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Exit mobile version