South Star Actors | సౌత్ సినిమా స్థాయి పెరుగుతున్నది. భారతీయ సినిమాలో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతుండగా.. సౌత్ సినిమాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దక్షిణాది నుంచి విడుదలవుతున్న సినిమాలు భారీగా కలెకన్షన్లను రాబడుతున్నాయి.
మొన్నటి వరకు ఒకే ప్రాంతానికి పరిమితమైన సౌత్ స్టార్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్‌కే గట్టి పోటీ ఇస్తున్నారు. కేవలం నటనతోనే కాకుండా సినిమాకు తీసుకునే పారితోషకం విషయంలోనూ బాలీవుడ్ తారలను మించిపోతున్నారు. ప్రస్తుతం దక్షిణాది స్టార్ హీరోలు బాలీవుడ్ హీరోల కంటే ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్నారు. వారెవరో తెలుసుకుందాం రండి..!
సూపర్ స్టార్ రజనీకాంత్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఈ సీనియర్ నటుడికి ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. నేటి యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. 2021లో వచ్చిన ‘అన్నతే’ చిత్రానికి రజనీకాంత్ రూ.100 కోట్ల పారితోషకం తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తుండగా.. ఈ సినిమాకు ఏకంగా రూ.150కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
కమల్ హసన్
యూనివర్సల్ హీరో కమల్ హసన్. గత ఆరు దశాబ్దాలుగా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2018లో ‘విశ్వరూపం’ సినిమా తర్వాత కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉన్న కమల్ 2022లో ‘విక్రమ్’తో రీఎంట్రీ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నది. ప్రస్తుతం కమల్ హసన్ ‘ఇండియన్-2’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.150కోట్ల పారితోషకం తీసుకున్నట్లు టాక్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. హిందీ బెల్ట్‌లోనూ ప్రభాస్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్నది. ప్రభాస్ ‘సలార్’, ‘ఆదిపురుష్, ‘ప్రాజెక్ట్-కే’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాష్ హీరోగా నట్టిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కోసం రూ.120కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం పుష్ప-1 విజయం తర్వాత పుష్పరాజ్ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు సమాచారం. పుష్ప పార్ట్-2 కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.120కోట్లు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
రామ్ చరణ్
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘RRR’. ఈ చిత్రంతో రామ్ చరణ్ కెరీర్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లింది. చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం ఏకంగా రూ.42కోట్లు తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం రామ చరణ్ ‘RC15’లో నటిస్తుండగా.. ఈ చిత్రానికి రూ.100కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్
సౌత్‌లో ప్రజాధరణ పొందిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ ఏడాది రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ కొమ్రంభీం పాత్రను పోషించాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు దాదాపుగా రూ.45కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత పారితోషకాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నటిస్తున్న ఒక్కో చిత్రానికి రూ.60కోట్ల నుంచి రూ.80కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.