Special Trains |
గంగా పుష్కరాలకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్-బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నటలు ప్రకటించింది. ఆయా రైళ్లు నేటి నుంచి మే 5 వరకు నడుస్తాయని పేర్కొంది.
పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్-బనారస్ నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు నంబర్ 07303 సికింద్రాబాద్ నుంచి శనివారం (ఏప్రిల్ 29) రాత్రి 9.40 గంటలకు బయలుదేరి.. మే 1న ఉదయం 6.30 గంటలకు బనారస్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో రైలు (07304) బనారస్ నుంచి మే 1న ఉదయం 08.35 గంటలకు బయలుదేరి.. మే 2న సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఇక రెండో రైలు ( 07305) సికింద్రాబాద్ నుంచి మే 3న రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మే 5న ఉదయం 6.30గంటలకు చేరుకుంటుంది.
తిరిగి రైలు (07306) మే 5న శుక్రవారం ఉదయం 8.35 గంటలకు బయల్దేరి శనివారం సాయంత్రం 6.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఆయా రైళ్లు.. జనగాం, కాజీపేట్, పెద్దపల్లి, రామగుండుం, బెల్లంపల్లి, సిర్పుర్‌కాగజ్‌నగర్, బల్హర్షా, నాగ్‌పూర్, పిపారియా, జబల్‌పూర్, కట్ని జంక్షన్, శాంతా, మణిపూర్, ప్రయాగ్‌రాజ్ తదితర స్టేషన్లలో ఆగనున్నది.