Sperm donor | ఏకంగా 600 మందిని పుట్టించాడు.. ఆపకపోతే జరిమానా వేస్తామన్న కోర్టు

Sperm donor విధాత: అతడి వయసు.. 41 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా 500 నుంచి 600 మందికి తండ్రి. దీనిపై కోర్టు సీరియస్‌ అయ్యింది. ఇక ఆపకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆ జరిమానా కూడా అంతో ఇంతో కాదు.. ఏకంగా వెయ్యి యూరోలు. అంటే మన కరెన్సీలో 90,41,657 రూపాయలన్నమాట. ఇంతకీ ఎవరా తండ్రి ఏమా కథ? నెదర్లాండ్స్‌కు చెందిన జొనాథన్‌ అనే 41 ఏళ్ల వ్యక్తి వీర్య దానం(Sperm donor) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 550 […]

  • Publish Date - April 29, 2023 / 01:57 PM IST

Sperm donor

విధాత: అతడి వయసు.. 41 ఏళ్లు. ప్రపంచవ్యాప్తంగా 500 నుంచి 600 మందికి తండ్రి. దీనిపై కోర్టు సీరియస్‌ అయ్యింది. ఇక ఆపకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆ జరిమానా కూడా అంతో ఇంతో కాదు.. ఏకంగా వెయ్యి యూరోలు. అంటే మన కరెన్సీలో 90,41,657 రూపాయలన్నమాట. ఇంతకీ ఎవరా తండ్రి ఏమా కథ?

నెదర్లాండ్స్‌కు చెందిన జొనాథన్‌ అనే 41 ఏళ్ల వ్యక్తి వీర్య దానం(Sperm donor) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 550 నుంచి 600 మందికి తండ్రి అయ్యాడు. దీనిపై సీరియస్‌ అయిన డచ్ కోర్టు.. ఇక ఈ పని ఆపాలని ఆర్డరేసింది. ఆపకపోతే వెయ్యి యూరోలు జరిమానా వేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది.

గతంలోనే నిషేధం.. అయినా..

నిజానికి వందకుపైగా పిల్లలకు తండ్రి అయినందుకు 2017లోనే నెదర్లాండ్స్‌లోని ఏ ఫెర్టిలిటీ క్లినిక్‌లోనూ అతడు వీర్యదానం చేయరాదని ఆయనపై కోర్టు నిషేధం ఉన్నది. కానీ.. అతడు ఆ పని మానలేదు. క్లినిక్‌లతో నిషేధం ఉండటంతో అటు నుంచి నరుక్కొచ్చాడు. ఆన్‌లైన్‌లో వీర్యదాన దుకాణం తెరిచాడు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు వీర్యం దానం చేశాడు.

క్లినిక్‌లలో నిల్వ చేసినవీ తొలగించాలి

వీర్యదానాన్ని ఆపాలని ఆదేశించిన కోర్టు.. తాను వీర్యం దానం చేసిన క్లినిక్‌లలో ఏమైనా నిల్వ చేసిన తన శుక్రకణాలు ఉంటే వాటిని వెంటనే నిర్వీర్యం చేయాలని కోరుతూ వాటికి లేఖలు రాయాలని కూడా తేల్చి చెప్పింది. అయితే.. ఒక మినహాయింపు మాత్రం ఇచ్చింది. ఇప్పటికే అతడి వీర్యం ద్వారా పిల్లలు కలిగి ఉన్నవారికి రిజర్వ్‌ చేసిన డోస్‌లను మాత్రం అలానే ఉంచవచ్చు అని పేర్కొన్నది.

ఒక ఫౌండేషన్‌, ఇతగాడి ద్వారా తల్లి అయిన ఒక మహిళ దాఖలు జొనాథన్‌పై దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌తో అతడు నిషేధం ఉన్నా వీర్యం దానం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. డచ్‌ క్లినిక్‌ల నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా స్పెర్మ్‌ డొనేషన్‌ ద్వారా 12 కుటుంబాలలో 25కు మించి పిల్లలకు తండ్రి అయ్యేందుకు వీలు లేదు.

కానీ.. జొనాథన్‌.. 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 550 నుంచి 500 మందిని పుట్టించేందుకు కారణమయ్యాడని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో ఇకపై వీర్యదానాన్ని పూర్తిగా బంద్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. తాను గతంలో చేసిన వీర్యదానాలపై వివరాలు చెప్పకుండా స్పెర్మ్‌డొనేషన్‌ కోరుకున్న జంటలను అతడు మోసం చేశాడని తేల్చింది.

ఇకపై ఎవ్వరినీ ఈ విషయంలో సంప్రదించరాదని జొనాథన్‌ను ఆదేశించింది. కోర్టు తీర్పుపై పిటిషన్‌ వేసిన మహిళ సంతోషం వ్యక్తం చేసింది. ఇలా మితిమీరిన డొనేషన్లను ఆపకపోతే అది కార్చిచ్చులా ప్రపంచమంతా విస్తరిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. తమ బిడ్డకు ప్రపంచవ్యాప్తంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఉండాలని ఏ దంపతులూ కోరుకోరని ఆమె అన్నారు.

నెదర్లాండ్స్‌లో ఎన్నో ఘన(వీ)కార్యాలు!

నెదర్లాండ్స్‌లో ఫెర్టిలిటీ కుంభకోణాల్లో ఇది తాజా కేసు. 2020లో ఒక గైనకాలజిస్టు ఇతరుల వీర్యం అని చెప్పి.. తన వీర్యాన్ని దానం చేయడం ద్వారా 17 మంది పిల్లలు పుట్టేందుకు కారణమయ్యాడు. 2019లో మరో ఘటనలో రొట్టెర్‌డామ్‌ అనే వైద్యుడు కూడా ఇంతకంటే పెద ఘనకార్యమే చేశాడు. తల్లికావాలని చికిత్స కోసం వచ్చిన మహిళలకు తన వీర్యాన్ని ఇన్‌సెమినేట్‌ చేయడం ద్వారా 49 మంది పుట్టేందుకు కారణమయ్యాడు.

Latest News