విధాత: కర్ణాటక (Karnataka) శివమొగ్గలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ప్రభుత్వాసుపత్రిలోకి ప్రవేశించిన కుక్క ప్రసూతి విభాగం నుంచి నవజాత శిశువును నోటకరుచుకొని వెళ్లింది. కుక్క శిశువును ఎత్తుకు వెళ్తున్న సమయంలో ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.
ఆసుపత్రి బయట కుక్క నోట్లో శిశువును గుర్తించిన సెక్యూరిటీ గార్డు.. దాని బారి నుంచి రక్షించాడు. వెంటనే ఆసుప్రతిలోకి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే, ఇప్పటికే చిన్నారి బాలుడు మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు.
Karnataka | A newborn child was found dead in Shivamogga, near District Hospital. The newborn was seen being carried by a stray dog near the maternity ward of the hospital on March 31. After being chased by a security guard it left the newborn and ran away. It is suspected that…
— ANI (@ANI) April 3, 2023
అయితే, ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కుక్క ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు వద్ద తిరుగుతోందని, దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుప్రతికి చేరుకొని.. ఘటనపై ఎఫ్‌ఆర్‌ఐ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శిశువు ముందే మృతి చెందిందా ? కుక్క కరవడంతోనే మృతి చెందిందా? అనే విషయం పోస్టుమార్టం తర్వాతే.. ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, కుక్క ఎత్తుకు వెళ్లిన శిశువు తల్లిదండ్రులెవరో తెలియరాలేదు. ఇందు కోసం ఆసుపత్రితో పాటు దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ ప్రైవేటు, ఆసుపత్రుల రికార్డులను పరిశీలిస్తున్నారు.