Site icon vidhaatha

Bengaluru | బెంగ‌ళూరును ముంచెత్తిన భారీ వ‌ర్షం.. న‌దుల‌ను త‌ల‌పిస్తున్న కాల‌నీలు

Bengaluru | క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో సోమ‌వారం రాత్రి భారీ వ‌ర్షం కురిసింది. ఈ భారీ వ‌ర్షానికి వ‌ర‌ద ఉప్పొంగింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో కాల‌నీలు న‌దుల‌ను త‌ల‌పించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వ‌ర‌ద నీరు ఇండ్ల‌లోకి చేర‌డంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బెంగళూరు ప్రాంతంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వైట్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌లో భాగమైన వర్తుర్‌లో నిన్న రాత్రి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

దీంతో సమీపంలోని బెల్లందూరు చెరువుతో పాటు హల్లెనాయకనహళ్లి, వర్తూరు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నీరంతా ఔటర్ రింగురోడ్డువైపు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వ‌ర‌ద నీటిని తొల‌గించేందుకు బెంగ‌ళూరు మున్సిపాలిటీ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రిస్తున్నారు. గ‌త నెల‌లో కురిసిన భారీ వ‌ర్షానికి 22 ఏండ్ల మ‌హిళ ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version