Site icon vidhaatha

india | ఇండియా కూట‌మి బ‌లోపేతం.. కాంగ్రెస్ ల‌క్ష్యం

india |

విధాత‌, హైద‌రాబాద్‌: ఇండియా కూట‌మి బ‌లోపేతంపై కాంగ్రెస్ కేంద్రీక‌రించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా త‌మ వ్యూహాల‌కు ఈ స‌మావేశంలో ప‌దును పెట్ట‌నున్న‌ది. అలాగే ఈ నెల‌18 నుంచి జ‌రిగే పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన తీరుపై చ‌ర్చించ‌నున్న‌ది. ఇండియా కూట‌మి రోజు రోజుకు బ‌లోపేతం అవుతున్న నేప‌థ్యంలో మ‌రోసారి బావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు దిగుతుంద‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇందుకు ధీటుగా స‌మాధానం ఇవ్వ‌డానికి సీడ‌బ్ల్యుసీ స‌మావేశాల‌ను వేదిక‌గా చేసుకోనున్న‌ది.

ప్ర‌త్యేక పార్ల‌మెంటు స‌మావేశాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నంలో నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ మేర‌కు ఏర్పాట్లు చేస్తుంది. ఈ సంద‌ర్భంగా 75 సంవ‌త్స‌రాల పార్ల‌మెంటు స‌మావేశాల‌పై కూడా చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లో కామ‌న్ సివిల్ కోడ్‌తో పాటు, పీఓకే అంశాన్ని కూడా ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు తీసుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తోంది. ఇప్ప‌టికే పీఓకే పై మీడియాలో చ‌ర్చ జ‌ర‌గేలా చేయ‌డాన్ని కాంగ్రెస్ పార్టీ నిశితంగా ప‌రిశీలిస్తోంది.

ఇలా బావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందే ప్ర‌య‌త్నం చేసే ప్ర‌మాదం ఉంద‌న్న‌చ‌ర్చ కూడా రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇలా పీఓకే అంశంపై భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టే తీరుగా చ‌ర్చ‌చేసి, విప‌క్షాలను కాశ్మీర్‌పై బ‌ద‌నాం చేసి, పార్ల‌మెంటును ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లే దిశ‌గా ప్ర‌య‌త్రిస్తే ఏమీ చేయాల‌న్న దానిపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంటుందంటున్నారు.

ముఖ్యంగా డిసెంబ‌ర్‌లో జ‌రిగే తెలంగాణ‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, మిజోరం, చ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డానికి చేయాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై సుధీర్ఘంగా చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా డిక్ల‌రేష‌న్స్ విడుద‌ల చేసింది. తాజాగా ప్ర‌తి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేయాల్సిన ప‌థ‌కాల‌పై కేంద్రీక‌రించింది.

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో తీకున్న ఈ విధానం స‌క్సెస్ అయింది. ఇదే తీరుగా మిగిలిన రాష్ట్రాల‌లో అమ‌లు చేయాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. తాజాగా సోనియా గాంధీ చేతుల మీదుగా తుక్కుగూడ‌లో జ‌రిగే స‌భ‌లో ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన 30 రోజుల్లోనే అమ‌లు చేసే దిశ‌గా కార్యాచ‌ర‌ణ రూపొందించిప్ర‌క‌టించాల‌ని సీడ‌బ్ల్యుసీలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇలా రాష్ట్రాల వారీగా ప్ర‌క‌టించే ప‌థ‌కాల‌నై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తారు.

Exit mobile version