Site icon vidhaatha

కోటాలో మ‌రో విద్యార్థి సూసైడ్‌.. ఈ ఏడాది 26 మంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

విధాత‌: దేశంలోనే కోచింగ్ హ‌బ్‌గా పేరుగాంచిన రాజ‌స్థాన్ కోటాలో మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కోటాలో నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థి బుధ‌వారం రాత్రి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఏడాది ఇత‌డితో కలిపి ఇప్ప‌టివ‌ర‌కు 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.


ప్ర‌భుత్వం, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు. కోటాలో నీట్ పరీక్షకు సొంతంగా సిద్ధమవుతున్న విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్టు అధికారులు తెలిపారు. అత‌డికి సంబంధించిన ఎలాంటి వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించ‌లేదు.


ఇంజినీరింగ్‌, మెడికల్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఏటా లక్షల మంది విద్యార్థులు దేశ న‌లుమూల‌ల నుంచి రాష్ట్రానికి వస్తుంటారు. కొన్నేండ్లుగా రాజస్థాన్ కోచింగ్ హబ్‌గా పేరొందిన కోటాలో నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. చదువుల ఒత్తిడి, ఫెయిల్యూర్‌ భయంతో విద్యార్థులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

Exit mobile version