Site icon vidhaatha

Supreme Court | క్రిమినల్‌ కేసు వివరాల వెల్లడికి విధి విధానాలేంటి?

Supreme Court |

న్యూఢిల్లీ: క్రిమినల్‌ కేసుల గురించి మీడియాకు పోలీసు అధికారులు వివరించే సమయంలో సమగ్ర మాన్యువల్‌ను సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖను సుప్రీం కోర్టు బుధవారం ఆదేశించింది. పక్షపాతంతో కూడిన రిపోర్టింగ్‌ వలన సదరు వ్యక్తి నేరం చేశాడేమో అనే సందేహం ప్రజల్లో రేకెత్తుతుందన్న సుప్రీం కోర్టు.. మీడియా కథనాలు కూడా బాధితుడి గోప్యతను ఉల్లంఘిస్తాయని పేర్కొన్నది.

మీడియా సమావేశాల్లో వివరాలు వెల్లడించే తీరుపై మాన్యువల్‌ను రూపొందించేందుకు సలహాలను అన్ని రాష్ట్రాల డీజీపీలు నెల వ్యవధిలో కేంద్ర హోంశాఖకు పంపాలని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల సంఘం సలహాలను కూడా తీసుకోవాలని బెంచ్‌ పేర్కొన్నది. దర్యాప్తు పురోగతిలో ఉన్న క్రిమినల్‌ కేసుల విషయంలో మీడియా బ్రీఫింగ్స్‌లో పాటించాల్సిన పద్ధతులకు సంబంధించిన పిటిషన్‌లో సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నది.

Exit mobile version