Telangana Assembly | విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. భట్టి బడ్జెట్ ప్రసంగం పిదప స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీని 12వ తేదీకి వాయిదా వేశారు. అటు మండలి సమావేశాలు సైతం అదేరోజుకు వాయిదా పడ్డాయి. సోమవారం సభలో బడ్జెట్ పై చర్చ కొనసాగనుంది. నీటి పారుదల శాఖపై మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. 13న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందర్శించనున్నారు.
అయితే సమావేశాలో మరో రెండు రోజుల పాటు పొడగించి ఈ నెల 15వరకు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. 14న ద్రవ్య వినిమయ బిల్లు చర్చ, కుల గణన, నీటీ పారుదల శాఖ అంశాలపై చర్చ జరుపాలని ప్రభుత్వం భావిస్తుంది. అటు ఆదివారం సీఎల్పీ భేటీ జరుగనుంది. ఈ భేటీలో నీటీ పారుదల శాఖ శ్వేత పత్రం విడుదల అంశంతో పాటు ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వం సాగించిన అవీనీతి అంశంపై చర్చించనున్నారు.