Site icon vidhaatha

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవం!


విధాత : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవం కానున్నారు. బుధవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబుతో పాటు బీఆరెస్‌ నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు.


గడ్డం ప్రసాద్‌ ఎన్నికకు బీఆరెస్‌ మద్దతు పలుకడంతో స్పీకర్‌గా ప్రసాద్‌ ఎన్నిక లాంఛనమే కానుంది. సాయంత్రం వరకు మరెవరు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నికవ్వనుండగా, ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అక్బరుద్ధిన్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు పునఃప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో గడ్డం ప్రసాద్‌ స్పీకర్‌గా వ్యవహారించనున్నారు.

Exit mobile version