Site icon vidhaatha

TSPSC | తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దు

విధాత‌: టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల లీకేజీ ప్రకంపనలతో రాష్ట్రమంతటా అట్టుకుతున్నది. పరీక్షలన్నీ రద్దు చేయాలని విద్యార్థిసంఘాలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. అయితే సిట్‌ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బైటికి వస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సర్వీస్‌ కమిషన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ (TSPSC) . ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా సర్వీస్‌ కమిషన్‌ రద్దు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌ 16 న గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌, ఈ ఏడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన అన్ని పరీక్షలకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను మళ్లీ జూన్‌ 11న నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇవేకాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్నిపరీక్షలను కూడా టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రద్దైన ఏఈఈ, డీఏవో పరీక్షల తేదీలను సర్వీస్‌ కమిషన్‌ త్వరలో ప్రకటించనున్నది.

Exit mobile version