విధాత, హైదరాబాద్ : ఖండాలు వేరైనా వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆన్‌లైన్‌లో గేమ్‌లో పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన అరుణ మురళీధర్ దంపతులు వృత్తిరీత్యా వైద్యులు. వారికి కూతురు మేఘనతో పాటు కొడుకు ఉన్నారు. మేఘన చిన్నతనంలోనే అమెరికాలోని న్యూయార్క్ సిటీకి వెళ్లింది.
న్యూ కాజిల్‌లో చదువుతున్నది. ఈ సమయంలో ఆన్‌లైన్‌లో నిజాం గేమ్ ఆడుతూ ఉండేది. గేమ్‌లో అడ్మిన్‌గా ఉండేది. ఇదే గేమ్‌లో న్యూయార్క్‌కు చెందిన గ్రెగారి సైతం మరో అడ్మిన్‌గా ఉండే వాడు. ఇలా వాళ్లిద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఇరువురు ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు మేఘన, గ్రేగారి పెళ్లికి ఒప్పుకున్నారు. హైదరాబాద్ శివారులోని అలంకృత రీసార్ట్స్‌లో బుధవారం భారతీయ సంప్రదాయం ప్రకారం.. బంధువుల సమక్షంలో ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు.