Site icon vidhaatha

బ‌స్సు రంధ్రం నుంచి ప‌డిన ప్ర‌యాణికురాలు


విధాత‌: త‌మిళ‌నాడులో ప్ర‌భుత్వ బ‌స్సుకు ఏర్ప‌డిన‌ రంధ్రం నుంచి ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు ప్ర‌మాద‌వశాత్తు ప‌డిపోయింది. బస్సు డ్రైవ‌ర్ వెంట‌నే బ్రేక్ వేయ‌డంతో ఆమె తృటిలో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఈ దారుణ ఘ‌ట‌న చెన్నైలో మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న‌ది. వివ‌రాల్లోకి వెళితే..


చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంటీసీ) బస్సులో వల్లలార్ నగర్-తిరువెర్కాడు మధ్య ప్రయాణిస్తున్న ఓ మ‌హిళ‌ సీటు నంబర్ 59లో కూర్చుంది. త‌న స్టేజీ రాగానే ఆమె సీటు నుంచి లేచి ముందుకు న‌డుస్తుండ‌గా, బ‌స్సు ఫ్లోర్‌పై ఏర్ప‌డిన రంధ్రం నుంచి ఒక్క‌సారిగా జారి రోడ్డుపై ప‌డిపోయింది. ప్రయాణికులు గ‌ట్టిగా అర‌వ‌డంతో డ్రైవర్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. ఆమె టైర్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది. కాస్త లేట‌యితే టైర్లు ఆమె పైనుంచి పోయేవి. ఆమెకు చిన్నపాటి గీతలు తగిలాయి. స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఈ సంఘటన మంగళవారం అమింజికరై సమీపంలో జరిగింది.


బ‌స్సు ఘ‌ట‌న‌ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై X (గతంలో ట్విట్టర్) పోస్టుచేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఫొటోల‌ను కూడా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Exit mobile version