నాడు త‌మ్ముడు జూ.ఎన్టీఆర్‌.. నేడు అన్న తారకరత్న: TDP ప్రచారంలో అపశృతులు

విధాత: ఒకప్పుడు మామ చంద్రబాబును గెలిపించుకునేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి కోలుకోగా, తాజాగా బామ్మ‌ర్ది లోకేశ్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న నంద‌మూరి తార‌క‌ర‌త్న స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. నాడు త‌మ్ముడు (జూనియ‌ర్ ఎన్టీఆర్), నేడు అన్న‌ (తార‌క‌ర‌త్న‌) వేర్వేరు ప్ర‌మాదాలకు గుర‌య్యారు. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి నిలకడగానే ఉన్నదని టీడీపీ నాయ‌కులు, వైద్యులు చెబుతున్నారు. 2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును గెలిపించేందుకు ఎన్టీఆర్‌ మ‌నువ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్.. ఎన్నికల […]

  • Publish Date - January 27, 2023 / 12:39 PM IST

విధాత: ఒకప్పుడు మామ చంద్రబాబును గెలిపించుకునేందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి కోలుకోగా, తాజాగా బామ్మ‌ర్ది లోకేశ్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న నంద‌మూరి తార‌క‌ర‌త్న స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. నాడు త‌మ్ముడు (జూనియ‌ర్ ఎన్టీఆర్), నేడు అన్న‌ (తార‌క‌ర‌త్న‌) వేర్వేరు ప్ర‌మాదాలకు గుర‌య్యారు. ప్ర‌స్తుతం తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి నిలకడగానే ఉన్నదని టీడీపీ నాయ‌కులు, వైద్యులు చెబుతున్నారు.

2009 సాధార‌ణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును గెలిపించేందుకు ఎన్టీఆర్‌ మ‌నువ‌డు జూనియ‌ర్ ఎన్టీఆర్.. ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన్నారు. రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగించుకుని హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో న‌ల్ల‌గొండ జిల్లాలో ఎన్టీఆర్ ప్ర‌మాదానికి గుర‌య్యారు. 2009, మార్చి 26వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో నల్ల‌గొండ‌ జిల్లా మోతె మండలం పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ రోడ్డు మలుపు వ‌ద్ద ఎన్టీఆర్ వ్యాన్ అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ఈ ఘటనలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు న‌టుడు రాజీవ్ క‌న‌కాలకు కూడా స్వ‌ల్పంగా గాయాల‌య్యాయి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, న‌టుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి ఎన్టీఆర్, రాజీవ్‌ను సూర్యాపేట‌లోని న్యూలైఫ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మొత్తానికి ఆ ప్ర‌మాదం నుంచి ఎన్టీఆర్, రాజీవ్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఇక తాజాగా నంద‌మూరి తార‌క‌ర‌త్న కూడా నారా లోకేశ్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న కాసేప‌టికే తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఉన్న‌ట్టుండి స్పృహ కోల్పోవ‌డంతో కుప్పంలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందించారు. 45 నిమిషాల పాటు ప‌ల్స్ ప‌డిపోయింది. వైద్యుల చికిత్స అనంత‌రం ప‌ల్స్ మొద‌లైంది. యాంజియోగ్రామ్ కూడా నిర్వ‌హించారు. తార‌క‌ర‌త్న గుండెలో ఎడ‌మవైపు 90 శాతం బ్లాక్ అయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరు తరలించారు.

Latest News