Site icon vidhaatha

Vemulawada | గ్రూపులు లేవు.. అపోహలే: వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చలిమెడ లక్ష్మీనరసింహారావు

Vemulawada |

విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ శాసనసభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా చలిమెడ లక్ష్మీనరసింహారావు పేరు ఖరారు కావడంతో, ఆయన అనుచరులు వేములవాడలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చల్మెడ క్యాంప్ కార్యాలయం నుండి నంది కమాన్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

నంది కమాన్ వద్ద వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడారు. తమ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, అపోహలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. త్వరలో అన్నీ సమసి పోతాయన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే రమేష్ బాబు నేతృత్వంలో, ఆయన సలహాలు, సూచనలు తీసుకొని ముందుకెళ్తామన్నారు. అందరం ఐక్యంగా పనిచేసి సీఎం కేసీఆర్ ను మూడోసారి సీఎం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీతో వేములవాడ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిదని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

Exit mobile version