విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్ది స్పందించారు. ఆ వ్యవహారంలో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చారు.
మా తండ్రి రాఘవరెడ్డి 1952లో మద్యం వ్యాపారం ప్రారంభించారు. రాజకీయాల్లో చురుగ్గా ఉండటంతో ఆ వ్యాపారం విరమించుకున్నాం.
నాకు, నా కుమారుడికి మద్యం వ్యాపారంలో ఒక్క శాతం వాటా లేదు.. డైరెక్టర్లుగా కూడా లేము. ఇటీవల ఢిల్లీ, చెన్నైలో మా ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఏమీ దొరకలేదని మాగుంట తెలిపారు.