TSPSC | ఇది ప్యాకేజీ, లీకేజీ గవర్నమెంట్: TPCC అధికార ప్రతినిధి డా.రియాజ్

టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జ్‌చే విచారణ జరపాలి అక్రమాలలో పెద్ద తలకాయలకు అవకాశముంది విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఇంతకాలం ప్యాకేజీ గవర్నమెంట్ మాత్రమే పాలన సాగిస్తుందనుకున్నామని, ఇప్పుడు లీకేజీ గవర్నమెంట్‌గా మారిందని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.రియాజ్ (Dr. Riaz) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పరీక్ష పత్రాల లీకేజ్‌పై తక్షణమే సిట్టింగ్ జడ్జ్ చే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఈ […]

  • Publish Date - March 14, 2023 / 09:18 AM IST

  • టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జ్‌చే విచారణ జరపాలి
  • అక్రమాలలో పెద్ద తలకాయలకు అవకాశముంది

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఇంతకాలం ప్యాకేజీ గవర్నమెంట్ మాత్రమే పాలన సాగిస్తుందనుకున్నామని, ఇప్పుడు లీకేజీ గవర్నమెంట్‌గా మారిందని టీపీసీసీ అధికార ప్రతినిధి డా.రియాజ్ (Dr. Riaz) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పరీక్ష పత్రాల లీకేజ్‌పై తక్షణమే సిట్టింగ్ జడ్జ్ చే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం ఆయన ఈ విషమై స్పందించారు. గత 8 సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వేయకుండా ఎన్నికల సంవత్సరంలో ఓట్ల లక్ష్యంగా ప్రభుత్వం నియామకాలు ప్రక్రియ మొదలు పెట్టిందని విమర్శించారు. బిస్వాల్ కమిటీ గుర్తించిన ఒక లక్ష 93 వేల ఉద్యోగాలకు భిన్నంగా 80 వేల ఉద్యోగాల భర్తీ అని ప్రకటించి, చివరకు 40వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసి ఒక ఉద్యోగాన్ని కూడా నేటి వరకు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎస్పీఎస్సీలో సిబ్బంది కొరత

టీఎస్పీఎస్సీ ఆఫీసులో కనీసం 400 ఉద్యోగులు పనిచేయాలి, కానీ అందులోనే 83 మంది మాత్రమే విధి నిర్వహణలో ఉన్నారు. వీరిలో 50 మంది డ్రైవర్స్ మరియు ఇతర భౌతిక శ్రమ చేసే ఉద్యోగులే అంటే టీఎస్పీఎస్సీ ఆఫీస్ 30 మంది ఉద్యోగులతో 80 వేల ఉద్యోగాలు భర్తీ ఎలా చేస్తుందని గుర్తు చేశారు.

లీకేజీ వెనుక పెద్ద తలకాయలు

ఈ లీకేజ్ వ్యవహారం వెనుక పెద్ద తలకాయలు ఉన్నట్లు రూడీ అవుతుందన్నారు. ఎందుకంటే కంప్యూటర్లో భద్రపరిచిన పాస్వర్డ్ రహస్యం కేవలం చైర్మన్ వద్ద, ఐఏఎస్ స్థాయి సెక్రటరీకి మాత్రమే తెలుస్తుందని, సాధారణ క్లర్కుకు తెలిసే అవకాశం లేదన్నారు.

అత్యంత కాన్ఫిడెన్షియల్‌గా ఉండే కంప్యూటర్ రూమ్‌లోకి కేవలం చైర్మన్, సెక్రటరీలు మాత్రమే వెళ్ళగలుగుతారు లేదా వారి సమక్షంలోనే వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఎలా వెళ్లి పేపర్లను లీక్ చేయగలుగుతాడని ప్రశ్నించారు.

ప్రవీణ్ ప్రవర్తనపై అనుమానాలు

ప్రవీణ్ అనే ఉద్యోగి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాసి. 103 మార్కులు తెచ్చుకున్నట్లుగా కొన్ని పేపర్లో రాశారు. దీనిపై ఎంక్వయిరీ జరగాలి. ఉద్యోగి లీవ్‌లో లేదా రిజైన్ చేయకుండా అదే డిపార్ట్మెంట్ నిర్వహించే ఎగ్జామ్ ఎలా రాస్తారని నిలదీశారు.

కేటీఆర్ పారదర్శకమంటే ఇదేనా?

కేటీఆర్ పదేపదే పారదర్శకతకు నిలువుటద్దం అంటూ టీఎస్పీఎస్సీ ఉద్యోగాల ప్రక్రియ దేశంలోనే పారదర్శకత అంటూ ప్రకటనలు గతంలో ఇచ్చారు. ఈ గవర్నమెంట్ ప్యాకేజీ గవర్నమెంట్ మాత్రమే కాదు, లీకేజీ గవర్నమెంట్ గా కూడా మారిందన్నారు. 15 నుండి 20 లక్షల నిరుద్యోగులు జీవితాలు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ తో ముడి పడి ఉన్నాయన్నారు. కష్టపడి చదివే లక్షలాది విద్యార్థులు తెలంగాణలో ఉన్నారు. వారి భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు.

ఆస్తులపై విచారణ చేపట్టాలి

టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనిత రామచంద్రన్, ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుల ఆస్తులపై సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరగాలని రియాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News