Site icon vidhaatha

రాజగోపాల్ రెడ్డికి షాకిచ్చిన ఆ ఇద్దరు.. TRSలో చేరిక

విధాత: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది.. భారతీయ జనతా పార్టీ తమ పట్టును కోల్పోతోంది. ఒక్క బూర నర్సయ్య గౌడ్‌ను బీజేపీ తన పార్టీలో చేర్చుకోగా అంతకు మించిన నాయకులు ఆ పార్టీని వీడి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

ఇవాళ మధ్యాహ్నం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌.. బీజేపీకి రాజీనామా చేసి, బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షాక్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేరుకోక ముందే.. మరో ఇద్దరు నాయకులు షాకిచ్చారు.

రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, అయితగోని విజయ్‌.. బీజేపీని వీడారు. మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో కారెక్కారు. గోవర్ధన్, విజయ్‌కు మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ పాల్గొన్నారు.

Exit mobile version