Site icon vidhaatha

MANCHERIAL | మంచిర్యాలలో పులి సంచారం.. ఏడాది తర్వాత రీ ఎంట్రీ! ఆందోళనలో ప్రజలు

MANCHERIAL

పాద ముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు

విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా నీల్వాయి ఫారెస్ట్ డివిజన్‌ కాటేపల్లి అడవుల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఫారెస్ట్ అధికారులు పులి పాద ముద్రలను సేకరించారు. ఆ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా ధ్రువీకరించారు. పాల్గుణ అనే పులి సంతతికి చెందిన కే -12 పులిగా అటవీ అధికారులు గుర్తించారు.

పులి సంచారంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది నుండి ఇప్పటివరకు పులి ఇటువైపు రాలేదు. ఏడాది తర్వాత పెద్దపులి సంచారం వెలుగుచూసింది. గతంలో కాగజ్ నగర్ డివిజన్ లో పాల్గుణ అనే పులి సంచరించింది. పాల్గుణ పులి రెండు దఫాలుగా 12 పిల్లలకు జన్మనిచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వాటికి K1 నుంచి K12 పేర్లతో వాటిని గుర్తించారు. దానిలో భాగంగానే ఇక్కడ సంచరించిన పులి K-12 పులి అని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపులి ప్రాణహిత తీరం మీదుగా ఖాగజ్ నగర్ కారిడార్ నుంచి నీల్వాయి అడవుల్లోకి ప్రవేశించిందని భావిస్తున్నారు. కోటపల్లి ఫారెస్ట్ డివిజన్ కుశ్నపల్లి, నీల్వాయి రేంజ్లలో పులి సంచరిస్తున్నటుగాల అటవీ అధికారులు గుర్తించారు.

రెండు రోజుల క్రితం పెద్దవాగు సమీపంలోని చింతమడుగు సమీపంలో ఆవుపై పులి దాడి చేసింది. కాటేపల్లి, నీల్వాయి, గొర్లపల్లి అటవి ప్రాంతాల్లో పాద ముద్రల ఆదారంగా 22 నెలల పులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. కే-12 పులిని ట్రేస్ చేయడానికి అటవీ శాఖ అధికారులు 60 ట్రాప్ కెమెరాలతో దాని సంచారాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు.

Exit mobile version