TIME World’s Greatest Places | టైమ్స్‌ మ్యాగజైన్‌ ప్రపంచ గొప్ప ప్రదేశాల జాబితాలో మయూర్‌భంజ్‌, లద్దాఖ్‌కు చోటు..!

TIME World's Greatest Places | టైమ్స్‌ మ్యాగజైన్‌ 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి రెండు ప్రాంతాలకు చోటు దక్కింది. అవే ఒడిశాలోని మయూర్‌భంజ్‌, లద్దాఖ్‌. ‘జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు.. పర్యాటకం, కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తుంది. 2023లో అన్వేషించాల్సిన అసాధారణ గమ్యస్థానాలు ఇవే’ అంటూ జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయాప్రాంతాలను ఎందుకు గొప్ప ప్రదేశాలుగా ఎంపిక […]

  • Publish Date - March 19, 2023 / 04:29 AM IST

TIME World’s Greatest Places | టైమ్స్‌ మ్యాగజైన్‌ 2023 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచంలోని 50 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి రెండు ప్రాంతాలకు చోటు దక్కింది. అవే ఒడిశాలోని మయూర్‌భంజ్‌, లద్దాఖ్‌. ‘జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు.. పర్యాటకం, కొత్త మానవ సంబంధాల ద్వారా ఉత్సాహం లభిస్తుంది. 2023లో అన్వేషించాల్సిన అసాధారణ గమ్యస్థానాలు ఇవే’ అంటూ జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయాప్రాంతాలను ఎందుకు గొప్ప ప్రదేశాలుగా ఎంపిక చేసిందో టైమ్స్‌ మ్యాగజైన్‌ వివరించింది.

ఆశ్చర్యపరిచే ఆల్పైన్ ల్యాండ్‌స్కేప్‌లు, బౌద్ధ సంస్కృతితో, ఉత్తర భారతదేశంలోని అత్యంత సుదూర ప్రాంతమైన లద్ధాఖ్‌ అనేక అద్భుతమైన అందాలను కలిగి ఉందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. 2023లో లడఖ్ రాజధాని లేహ్‌కు ఆగ్నేయంగా 168మైళ్ల దూరంలో ఉన్న హన్లే గ్రామంలో భారతదేశం తన మొదటి డార్క్ స్కై రిజర్వ్‌ను ఏర్పాటు చేసింది. ఈ లద్దాఖ్‌లోని ఛాంగ్‌థాంగ్ కోల్డ్ డెసెర్ట్ వైల్డ్‌లైఫ్ శాంక్యురీలో.. డార్క్ స్కై రిజర్వ్‌ ఏర్పాటైంది.

భారత్‌లో ఇలాంటి ఏర్పాటు చేయడం తొలిసారి. దీన్ని నైట్ స్కై శాంక్చురీ కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక మయూర్‌భంజ్‌ పచ్చని ప్రకృతి సంపదతో అలరాలుతున్నది. ఒడిశా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, పురాతన ఆలయాలకు ప్రసిద్ధి. మయూర్‌భంజ్ అరుదైన నల్లపులి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నల్లపులి కనిపించే ఏకైక ప్రదేశం ఈ భూమిపై ఇదే. అలాగే ప్రసిద్ధ సిమిలిపాల్ నేషనల్ పార్క్ ఈ జిల్లాలో చూడదగ్గ ప్రదేశం.

Latest News