Site icon vidhaatha

Ramineni Srinivasa Rao : రామినేని శ్రీనివాసరావుకు టీఎన్జీవో నేతల ఘన నివాళులు

Ramineni Srinivasa Rao : టీఎన్జీవో రాష్ట్ర కోశాధికారి రామినేని శ్రీనివాసరావు కు ఆ సంఘం నేతలు ఘన నివాళులర్పించారు. శ్రీనివాస్ రావు స్వగృహంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియచేశారు. నివాళులు అర్పించిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ టీజీవోల అధ్యక్షుడు ఎం.బి. కృష్ణ యాదవ్, టీఎన్జీవో వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.

ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ బొట్టు శ్రీనన్న(రామినేని శ్రీనివాసరావు) జీవితమంతా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటే కొనసాగిందని వారు లేని ఉద్యమాన్ని ఊహించుకోలేమన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన ఉద్యమాలతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపురులు ఊదిన బొట్టు శ్రీనన్న అకాల మరణం తమను తీవ్రంగా కలిసి వేసిందని తెలిపారు. వారి మృతి టీఎన్జీవో కేంద్ర సంఘానికి తీరని లోటని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతవరకు శ్రీనన్న అమరుడుగా ఉంటాడని వారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Exit mobile version