IKP VOAలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని టోకెన్ సమ్మె: CITU

విధాత‌: తెలంగాణ ఐకెపి వీఓఏ(voa) ఉద్యోగుల సంఘం సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మార్చి 16 ,17, 18 తేదీల్లో టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మొదటి రోజు గురువారం రోజు టిటిడి కళ్యాణ మంటపం ముందు టెంట్ వేసుకొని సమ్మె శిబిరం ప్రారంభించారు. సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. ఐకెపి వీఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు 26,000 అమలుపరచాలని కోరారు. అలాగే […]

  • Publish Date - March 16, 2023 / 03:34 PM IST

విధాత‌: తెలంగాణ ఐకెపి వీఓఏ(voa) ఉద్యోగుల సంఘం సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మార్చి 16 ,17, 18 తేదీల్లో టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మొదటి రోజు గురువారం రోజు టిటిడి కళ్యాణ మంటపం ముందు టెంట్ వేసుకొని సమ్మె శిబిరం ప్రారంభించారు.

సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. ఐకెపి వీఓఏలను సెర్ఫ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు 26,000 అమలుపరచాలని కోరారు. అలాగే సెర్ఫ్ నుంచి ఐడీ కార్డులు, గుర్తింపు కార్డులు, డ్రస్సులు ఇవ్వాలని, ఆన్‌లైన్ పద్ధతిని ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సిఐటియు జిల్లా సీనియర్ నాయకులు కిల్లే గోపాల్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా గ్రూపులు ఏర్పాటు చేసి మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగడానికి, ఆర్థిక తోడుపాటుగా బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తూ తిరిగి రుణాలను కట్టిపిస్తూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న ఐకెపి వీఓఏ ఉద్యోగులపై ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తుందని ఆయన విమర్శించారు. సమ్మె శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రాములు సందర్శించి మద్దతిచ్చి మాట్లాడారు. అభివృద్ధి అంటే ఫ్లై ఓవర్లు, రోడ్లు,పెద్ద పెద్ద భవనాలు కావని ప్రజలకు అవసరమైన కనీస వేతనాలు, ఆరోగ్యం, విద్యా, వైద్యం ముఖ్యమన్నారు. వీఓఏలు చేపట్టిన సమ్మెకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలిపారు.

ఏఐపిఎస్ఓ ఐప్సో ప్రపంచ శాంతి సంఘీభావ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రామ్ రెడ్డి ప్రసంగిస్తూ ఐకెపి వీఓఏలు గత 20 ఏళ్లుగా సెర్ఫ్‌లో పనిచేస్తున్నారని వారికి కనీస వేతనాలను అమలు కాకపోవడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల సరైన ఆహారం లేక పోషకాహార లోపంతో బాధలు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తెలంగాణ ఐకెపి వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల, రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో 10,000వేలు ఇస్తామనిమోసం చేసిందని కేవలం రూ 3900 వేతనం ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతుందని విమ‌ర్శించారు. ఆన్‌లైన్ పని వల్ల తీవ్ర మానసిక ఇబ్బందులకు గురై వీఓఏలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తక్షణమే జీతాలు పెంచి ప్రభుత్వము చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. స‌మ్మెలో సిఐటియు పట్టణ నాయకులు రాజ్ కుమార్, IKP జిల్లా ఉపాధ్యక్షురాలు వర్షా బేగం, కృష్ణ, కే అంజనేయులు, భీమయ్య, రమేష్, సంతోష్, సునీత, వెంకటయ్య, సరిత, దేవమణి తిరుపతమ్మ ,అలివేలు తదితరులు పాల్గొన్నారు.

సమ్మె 17వ తేదీ పట్టణంలో భిక్షాటన, 18వ తేదీ టిటిడి కళ్యాణమండపం నుండి కలెక్టరేట్‌కు పాదయాత్రగా చేరుకొని వినతిపత్రం ఇస్తామని వారు తెలిపారు.

Latest News