Site icon vidhaatha

Revanth Reddy | రేవంత్ రెడ్డి కాన్వాయ్‌‌కు ప్రమాదం.. కార్లు పూర్తిగా ధ్వంసం

విధాత‌: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth Reddy) భారీ ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాదయాత్రలో భాగంగా రేవంత్ శ్రీపాద ప్రాజెక్టు (Sripada Project) సందర్శనకు బయలుదేరారు. ఈ సమయంలో రేవంత్ కాన్వాయ్‌లో కార్లు అతివేగంతో ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్‌లోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసం, కాగా పలు మీడియా వీ6, టీవీ 9, ఎన్టీవీ, ఏబీఎన్, సాక్షి, న్యూస్ నౌ, బిగ్ టీవీ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం.

స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. ఎవరి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి వేరే కారులో శ్రీపాద ప్రాజెక్ట్ సందర్శనానికి వెళ్లారు.

Exit mobile version