Traffic Restrictions | ఈ నెల 29న హైదరాబాద్‌లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. బక్రీద్ సందర్భంగా ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ నిబంధనలుంటాయని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్న మీరాలం ట్యాంక్ ఈదర్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
గురువారం ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే వారి వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పురానాపూల్, కామాటిపురా, కిషన్బాగ్ నుంచి ఈద్గా వైపు వచ్చే వెహికల్స్ను జూ పార్కు, మసీదు అల్లా ఏరియాలోని ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేయాలని సూచించారు.
శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి ఈద్గాకు వచ్చే వాహనాలు శాస్త్రిపురం, ఎన్ఎస్ కుంట రూట్లో వెళ్లాల్సి ఉంటుందని, పురానాపూల్ నుంచి బహదూర్ పురా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు జియాగూడ, సిటీ కాలేజీ మీదుగా మళ్లించినట్లు సీపీ వివరించారు.