Site icon vidhaatha

TS ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం.. 100% సిలబస్‌తో పరీక్షలు

విధాత: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేండ్ల నుంచి 70 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డు.. ఈ విషయంలో మార్పులు చేసింది. ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలతో పాటు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడా వంద శాతం సిలబస్‌తోనే నిర్వహించనున్నారు. కొవిడ్ వల్ల గత రెండేండ్ల నుంచి 70 శాతం సిలబస్‌తో ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version