విధాత: తెలంగాణలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) నియామక పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ (TSPSC) అందుబాటులో ఉంచింది. హాల్ టికెట్లను ఈ నెల 28న ఏఎంవీఐ నియామక పరీక్ష జరగనున్నది. ఈ లింగ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. https://hallticket.tspsc.gov.in/h312022eb2fb828-29cf-426a-d75k-daf703516156
ప్రాక్టిస్ కోసం వెబ్‌సైట్‌లో మాక్ టెస్ట్ లింక్‌నూ అధికారులు అందుబాటులో ఉంచారు. తెలంగాణ రవాణా శౄఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయడానికి జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 వరకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్ష ఏప్రిల్ 23 జరగాల్సి ఉండె. కానీ టీఎస్పీపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించడంతో సర్వీస్ కమిషన్ పలు పరీక్షలను రీషెడ్యూల్ చేసిన విషయం విదితమే.