TSPSC: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విధాత‌: టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని రాజమండ్రికి చెందిన వ్యక్తి అని రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ 60 ఏండ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును రాజమండ్రికి చెందిన ప్రవీణ్ కుమార్ చేతిలో పెట్టాడని ఆరోపించారు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకొని తొమ్మిది సంవత్సరాలు గడిచినా, తెలంగాణకు చెందిన వ్యక్తి కంప్యూటర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేయడానికి పనికిరాడా అని […]

  • Publish Date - March 23, 2023 / 12:53 PM IST

విధాత‌: టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజీ కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని రాజమండ్రికి చెందిన వ్యక్తి అని రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ 60 ఏండ్ల పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును రాజమండ్రికి చెందిన ప్రవీణ్ కుమార్ చేతిలో పెట్టాడని ఆరోపించారు.

త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకొని తొమ్మిది సంవత్సరాలు గడిచినా, తెలంగాణకు చెందిన వ్యక్తి కంప్యూటర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేయడానికి పనికిరాడా అని అడిగారు. జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి తెలంగాణకు చెందిన అధికారి లేడా అని అడిగారు.

తెలంగాణకు చెందిన నిజాయితీ గల అధికారులు ఎందరో ఉన్నారు.. కానీ, టీఎస్పీఎస్సీ కేసును విచారిస్తున్న సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ విజయవాడకు చెందిన వ్యక్తి అని అన్నారు. ఆనాడు కేసీఆర్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సమైక్య పాలనలో తెలంగాణకు చెందిన వ్యక్తి అడ్వొకేట్ జనరల్‌గా లేడని అన్నారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేయడానికి తెలంగాణ బిడ్డ లేడా..? అని అడిగారు.

30లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చుక్కా రామయ్య, హరగోపాల్, కోదండరాం, నాగేశ్వర్‌ లతో పాటు తెలంగాణ మేధావులను తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తెలంగాణ వస్తే బిడ్డల బతుకులు బాగుపడతాయన్నారు.

మరీ రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. దొర ఎంగిలి మెతుకులకు ఆశపడి అల్లం నారాయణ కేసీఆర్ పంచన చేరారన్నారు. తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారన్నారు.

Latest News